Baby movie review: రివ్యూ: బేబీ.. ముక్కోణపు ప్రేమకథ మెప్పించిందా? (2024)

Baby movie review in telugu: ఆనంద్‌ దేవరకొండ (anand devarakonda), వైష్ణవి (vaishnavi chaitanya), విరాజ్‌ (Viraj Ashwin) కీలక పాత్రల్లో నటించిన ముక్కోణపు ప్రేమకథ ఎలా ఉంది? నేటి యువతరాన్ని మెప్పించేలా సాయిరాజేశ్‌ తెరకెక్కించారా?

Published : 14 Jul 2023 07:15 IST

Baby movie review: చిత్రం: బేబీ; న‌టీన‌టులు: ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య‌, విరాజ్ అశ్విన్‌, నాగ‌బాబు, సాత్విక్ ఆనంద్, బబ్లూ, లిరిష, కుసుమ త‌దిత‌రులు; సంగీతం: విజయ్ బుల్గానిన్; ఛాయాగ్రహణం: ఎం.ఎన్. బాల్ రెడ్డి; రచన, దర్శకత్వం: సాయి రాజేష్ నీలం; నిర్మాత: ఎస్.కె.ఎన్; విడుదల తేదీ: 14-07-2023

Baby movie review: రివ్యూ: బేబీ.. ముక్కోణపు ప్రేమకథ మెప్పించిందా? (1)

టీవ‌ల కాలంలో విడుద‌ల‌కు ముందే పాట‌లు, ప్ర‌చార చిత్రాల‌తో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన చిత్రం ‘బేబీ’(Baby movie). ఆనంద్ దేవ‌ర‌కొండ, వైష్ణ‌వి చైత‌న్య‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్ర‌మిది. ‘క‌ల‌ర్ ఫొటో’ వంటి సినిమాకి క‌థ అందించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం.. ‘టాక్సీవాలా’ వంటి హిట్ త‌ర్వాత ఎస్‌కేఎన్ సోలోగా నిర్మించిన సినిమా కావ‌డం.. టీజ‌ర్‌, ట్రైల‌ర్లు యువ‌త‌రం మెచ్చేలా కొత్త‌ద‌నం నింపుకొని ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌టంతో దీనిపై ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి ఆ అంచ‌నాల్ని ఈ ‘బేబీ’ అందుకుందా? (Baby movie review in telugu) ఈ సినిమాతో ఆనంద్ దేవ‌ర‌కొండ హిట్ ట్రాక్ ఎక్కారా? సాయి రాజేష్ ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటారా?

క‌థేంటంటే: వైషు అలియాస్ వైష్ణ‌వి (వైష్ణ‌వి చైత‌న్య‌) ఓ బ‌స్తీ అమ్మాయి. చిన్న‌ప్ప‌టి నుంచి త‌న ఎదురింట్లో ఉండే ఆనంద్ (ఆనంద్ దేవ‌ర‌కొండ‌)ను ప్రేమిస్తుంటుంది. ఆ ప్రేమ‌ను అత‌నూ అంగీక‌రిస్తాడు. వీరి ప్రేమ స్కూల్ డేస్‌లోనే ముదిరి పాకాన ప‌డుతుంది. అయితే ప‌దో త‌ర‌గ‌తి త‌ప్ప‌డంతో ఆనంద్ (Anand devarakonda) ఆటో డ్రైవ‌ర్‌గా స్థిర‌ప‌డ‌తాడు. వైష్ణవి (Vaishnavi chaitanya) మాత్రం ఇంట‌ర్ పూర్తి చేసి పేరున్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చేరుతుంది. అక్క‌డ కొత్త ప‌రిచ‌యాల వ‌ల్ల వైషూ ఆలోచ‌నా విధానంలో మార్పులు మొద‌ల‌వుతాయి. ఈ క్ర‌మంలోనే ఆమె త‌న క్లాస్‌మెట్‌ విరాజ్ (విరాజ్ అశ్విన్)కు దగ్గరవుతుంది. స్నేహం పేరుతో మొద‌లైన ఆ బంధం ఆ త‌ర్వాత అడ్డ‌దారులు తొక్కుతుంది. ఈ క్ర‌మంలోనే అనుకోని ప‌రిస్థితుల వ‌ల్ల విరాజ్‌కు వైష్ణ‌వి శారీర‌కంగా ద‌గ్గ‌ర‌వ్వాల్సి వ‌స్తుంది. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది? వీరిద్ద‌రి వ్య‌వ‌హారం ఆనంద్‌కు తెలిసిందా? నిజం తెలిశాక త‌ను ఎలా స్పందించాడు? అలాగే విరాజ్‌కు వైష్ణ‌వి - ఆనంద్‌ల ప్రేమ‌క‌థ తెలిసిందా? అస‌లు ఆనంద్ - విరాజ్‌ల‌లో వైష్ణ‌వి ఎవ‌ర్ని ప్రేమించింది? (Baby movie review in telugu)అన్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవాలి.

ఎలా సాగిందంటే: ‘మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ బేబీ ట్రైలర్ ఆరంభంలో రాసిన కొటేషన్ ఇది. ఈ మాట‌కు త‌గ్గ‌ట్లుగానే చిత్ర క‌థ‌న‌మంతా సాగుతుంది. స్కూల్ డేస్‌లో తెలిసీ తెలియ‌ని వ‌య‌సులో ఓ అమ్మాయి, అబ్బాయి మ‌ధ్య పుట్టిన ప్రేమ‌క‌థ.. వారు ఎదిగే క్ర‌మంలో ఎలాంటి మ‌లుపులు తిరిగింది? ఆ ప్రేమ ఏ కంచికి చేరింది? అన్న‌ది క్లుప్తంగా ఈ చిత్ర క‌థాంశం. చిన్న‌వో.. పెద్ద‌వో నిజానికి ఇలాంటి చిన్న‌నాటి తొలి ప్రేమ‌క‌థ‌లు చాలా మంది జీవితాల్లో క‌నిపిస్తూనే ఉంటాయి. అయితే వాటిలో కాలంతో పరిణ‌తి చెందుతూ పెళ్లి పీట‌లు దాకా ఎక్కేవి కొన్ని మాత్ర‌మే. వీటిలో ఎక్కువ శాతం విషాద ప్రేమ‌క‌థ‌లే ఉంటాయి. అలాంటి ఓ సున్నిత‌మైన ప్రేమ‌క‌థ‌నే ‘బేబీ’ (Baby movie review in telugu) రూపంలో ఎంతో స‌హ‌జంగా తెర‌పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు సాయి రాజేష్‌.

  • ఇదీ చదవండి: ఎనిమిదేళ్ల కష్టం..యూట్యూబ్‌ స్టార్‌నుంచి..కథానాయికగా..

ఇది ముఖ్యంగా ఈత‌రం యువ‌త‌కు బాగా క‌నెక్ట్ అయ్యేలా ఉంటుంది. సినిమాలో క‌నిపించే చాలా స‌న్నివేశాలు ఈ కాలం యువ‌తీ యువ‌కుల మ‌ధ్య ఉన్న ప్రేమ‌కు.. వారి ఆలోచ‌నా విధానాల‌కు అద్దం ప‌ట్టేలాగే ఉంటాయి. భ‌గ్న ప్రేమికుడిగా ఆనంద్‌ను ప‌రిచ‌యం చేసి.. అత‌ని కోణం నుంచి అస‌లు క‌థ‌ను ఆరంభించిన తీరు బాగుంటుంది. (Baby movie review) అక్క‌డి నుంచి తొలి ఇర‌వై నిమిషాల పాటు వైష్ణ‌వి - ఆనంద్‌ల స్కూల్ డేస్ ప్రేమ‌క‌థే ప్ర‌ధానంగా సాగుతుంది. ఈ పాఠ‌శాల ప్రేమ‌క‌థ స‌హ‌జ‌త్వం నింపుకొని మ‌న‌సులకు హ‌త్తుకునేలా సాగినా.. కాస్త సాగదీశారేమో అనిపిస్తుంది. పెద్ద‌గా మాట‌లు లేకుండా కేవ‌లం హావభావాలు, నేప‌థ్య సంగీతంతో వారి ప్రేమ‌ను హైలైట్ చేసిన తీరు ఆక‌ట్టుకుంటుంది. ఆనంద్ టెన్త్ ఫెయిలై ఆటో డ్రైవ‌ర్‌గా మార‌డం.. వైష్ణ‌వి ఇంట‌ర్ పూర్తి చేసి పై చ‌దువుల‌కు కాలేజ్‌లో చేర‌డంతో వీరి ప్రేమ‌కథ మ‌రో మ‌లుపు తీసుకుంటుంది.

Baby movie review: రివ్యూ: బేబీ.. ముక్కోణపు ప్రేమకథ మెప్పించిందా? (2)

ఇక వైషూ కాలేజీలో చేరిన‌ప్ప‌టి నుంచి ఏమ‌వుతుందోన‌ని ఆనంద్ కంగారు ప‌డ‌టం.. ఈ క్ర‌మంలో ఆమెపై అనుమానం పెంచుకోవ‌డం.. కాలేజీలో ఫ్రెండ్స్‌ను చూసి వైషూ త‌న లైఫ్ స్టైల్ మార్చుకోవ‌డం.. అది చూసి ఆనంద్ మ‌రింత ఆందోళ‌న ప‌డ‌టం.. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య అభిప్రాయ భేదాలు.. ఆయా స‌న్నివేశాల‌న్నీ ఎంతో స‌హ‌జంగా ఆస‌క్తిరేకెత్తిస్తూ సాగుతాయి.(Baby movie review in telugu) ఇక ఎప్పుడైతే విరాజ్‌.. వైష్ణ‌వి జీవితంలోకి ఎంట్రీ ఇస్తాడో... అక్క‌డి నుంచి ఆనంద్ - వైషూల ప్రేమ‌క‌థ‌లో సంఘ‌ర్ష‌ణ మొద‌ల‌వుతుంది. సాఫీగా సాగుతున్న క‌థ కాస్త ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. విరామానికి ముందు వైష్ణ‌వితో ఆనంద్ గొడ‌వ ప‌డ‌టం.. అనంత‌రం బాధ‌తో వైషూ ప‌బ్‌లో త‌ప్ప‌తాగి ఆనంద్‌కు ఫోన్ చేసి క్లాస్ పీక‌డం.. ఈ రెండు ఎపిసోడ్లకు థియేట‌ర్ల‌లో క్లాప్స్ ప‌డ‌తాయి.

ఇక ఇంట‌ర్వెల్ ఎపిసోడ్ ఒక్క‌సారిగా క‌థ‌లో హీట్ పెంచ‌డ‌మే కాక ద్వితీయార్ధంపై మ‌రింత ఆస‌క్తిరేకెత్తించేలా చేస్తుంది. అయితే ఈ ఆస‌క్తిని ఇలాగే కొన‌సాగించ‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ్డాడు. (Baby movie review) ఓవైపు ఆనంద్‌కు నిజాన్ని తెలియ‌కుండా దాచి పెడుతూ.. మ‌రోవైపు విరాజ్‌తో బంధాన్ని కొన‌సాగిస్తూ వైష్ణ‌వి న‌డిపే ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ కాస్త సాగతీత వ్య‌వ‌హారంగా అనిపిస్తుంది. ఇక విరాజ్ కుట్ర పూరిత మ‌న‌స్త‌త్వం బ‌య‌ట ప‌డ్డాక అత‌ని నుంచి బ‌య‌ట ప‌డేందుకు వైష్ణ‌వి ప‌డే మాన‌సిక సంఘ‌ర్ష‌ణ ఆక‌ట్టుకుంటుంది. ప‌తాక స‌న్నివేశాలు భావోద్వేగ‌భ‌రితంగా ఉంటాయి. అయితే ఆ ఎపిసోడ్ మ‌రీ న‌త్త‌నడ‌క‌న సాగిన‌ట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ ఏమాత్రం సంతృప్తిక‌రంగా అనిపించ‌దు. ప్రేమిస్తే త‌ర‌హా సినిమాల్ని గుర్తుకు వస్తాయి.

  • ఇదీ చదవండి:రివ్యూ: మిషన్‌ ఇంపాజిబుల్‌: డెడ్‌ రెకొనింగ్‌ (పార్ట్‌-1)

ఎవ‌రెలా చేశారంటే: ఈ సినిమాలో ఆనంద్ పాత్ర‌లో ఆనంద్ దేవ‌ర‌కొండ (Anand devarakonda) చాలా కొత్త‌గా క‌నిపించారు. స్కూల్ డేస్ పాత్ర త‌న‌కంతగా న‌ప్ప‌లేద‌నిపించింది. ఆటోడ్రైవ‌ర్‌గా స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. భావోద్వేగ‌భ‌రిత స‌న్నివేశాలు బాగా చేసినా.. ప‌తాక స‌న్నివేశాల్లో న‌ట‌న కాస్త తేలిపోయిన‌ట్ల‌నిపించింది. కాకపోతే వైష్ణ‌వికి ఆయ‌న‌కూ మ‌ధ్య కెమిస్ట్రీ చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది. క‌థానాయిక‌గా వైష్ణ‌వికి (vaishnavi chaitanya) మంచి పరిచయ చిత్రమిది. ఇందులో ఆమె బ‌స్తీ అమ్మాయిగా.. గ్లామ‌ర్ గ‌ర్ల్‌గా లుక్స్‌లోనే కాదు న‌ట‌న‌లోనూ చ‌క్క‌టి వేరియేష‌న్స్ చూపించింది. (Baby movie review in telugu) ఆమె పాత్రే సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. బోల్డ్ స‌న్నివేశాల్లో ఆమె అందాలు ఒలికించింది. భావోద్వేగ‌భ‌రిత స‌న్నివేశాల్లో చ‌క్క‌టి న‌ట‌న క‌న‌బ‌రిచింది.

ప్ర‌తినాయ‌క ఛాయ‌లున్న పాత్ర‌లో విరాజ్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. నాగ‌బాబు, హ‌ర్ష త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి. సాయి రాజేష్ ఎంచుకున్న క‌థ.. రాసుకున్న సంభాష‌ణ‌లు.. సినిమాని స‌హ‌జంగా తెర‌పై ఆవిష్క‌రించిన తీరు యువ‌త‌రాన్ని మెప్పిస్తాయి. అయితే కథ, కథనాలను ఎక్కువ స్ట్రెచ్‌ చేశారేమో అనిపిస్తుంది. సినిమాలో ఏ పాత్ర‌కూ అర్థవంతమైన ముగింపు ఇవ్వ‌లేదు. దీని ప్ర‌భావం క్లైమాక్స్‌పై ప‌డింది. విజ‌య్ బుల్గానిన్ నేప‌థ్య సంగీతం, పాట‌లు సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. బాల్‌రెడ్డి విజువ‌ల్స్ ఎంతో స‌హ‌జంగా ఉన్నాయి. నిర్మాణ విలువ‌లు క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి.

  • బ‌లాలు
  • + క‌థా నేప‌థ్యం
  • + యువ‌త‌రం మెచ్చే అంశాలు
  • + పాట‌లు, నేప‌థ్య సంగీతం
  • బ‌ల‌హీన‌త‌లు
  • - నెమ్మ‌దిగా సాగే క‌థ‌నం
  • - ముగింపు
  • చివ‌రిగా:టీనేజ్ కుర్రాళ్ల గుండెల్ని గ‌ట్టిగా కొట్టే ‘బేబీ
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

  • Cinema News
  • Movie Review
  • Telugu Movie Review
  • Anand Deverakonda

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Baby movie review: రివ్యూ: బేబీ.. ముక్కోణపు ప్రేమకథ మెప్పించిందా? (2024)

References

Top Articles
Latest Posts
Article information

Author: Arielle Torp

Last Updated:

Views: 6042

Rating: 4 / 5 (61 voted)

Reviews: 92% of readers found this page helpful

Author information

Name: Arielle Torp

Birthday: 1997-09-20

Address: 87313 Erdman Vista, North Dustinborough, WA 37563

Phone: +97216742823598

Job: Central Technology Officer

Hobby: Taekwondo, Macrame, Foreign language learning, Kite flying, Cooking, Skiing, Computer programming

Introduction: My name is Arielle Torp, I am a comfortable, kind, zealous, lovely, jolly, colorful, adventurous person who loves writing and wants to share my knowledge and understanding with you.